పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు ఓడల ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు ఇలా రెండిటి లో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. మరొకవైపు సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు సరికొత్త ప్రాజెక్టులను అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత మరే సినిమాని రిలీజ్ చేయలేదు. పవన్ కొత్త సినిమాలు అయితే ప్రకటిస్తూ ఉన్నారు తప్ప తన తదుపరి చిత్రాలను మాత్రం విడుదల తేదీని ప్రకటించలేదు.

ఇక పాన్ ఇండియా లేవల్ల తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమాని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంకా 40 రోజులపాటు షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు కొద్ది రోజుల నుండి బ్రేక్ ఇచ్చి మల్లి రాజకీయాల వైపు అడుగు వేశారు. ఇప్పుడు ఈ సినిమానే కాకుండా మరొక కొత్త ప్రాజెక్టును కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ వీరమల్లు పూర్తికాకుండానే హరి శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రకటించారు.

అలాగే సుజీత్ దర్శకత్వంలో ఓజి సినిమాని ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఇక సముద్రఖని డైరెక్షన్ లో కూడా ఒక సినిమాని లాంచ్ చేయవలసి ఉండగా ఈ సినిమా కోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరపకుండా ఉండగానే డైరెక్ట్ గా షూటింగ్ను మెదడు మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సెట్లో రేపటి నుంచి బిజీగా కాబోతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరంతేజ్ కూడా నటించబోతున్నారు. పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాని త్రివిక్రమ్ కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి అసలు విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: