టాలీవుడ్ అగ్ర హీరో  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 24న జరగాల్సి ఉండగా తారకరత్న హఠాన్మరణంతో వాయిదా వేసారు. ఇదే విషయాన్ని మూవీ టీం ఓ ప్రెస్ నోట్ ద్వారా చెబుతూ..' ఎన్టీఆర్30 ప్రారంభోత్సవం ఫిబ్రవరి 24న జరగాల్సింది. అయితే నందమూరి కుటుంబంలో జరిగిన విషాద ఘటన కారణంగా వాయిదా పడింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని' ఆ ప్రెస్ నోట్లో వెల్లడించారు. 

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివ జాన్వి కపూర్ నే హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా కోసం జాన్వి కపూర్ ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. నిజానికి ఈ సినిమాతోనే ఆమె తెలుగు వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. మొదటి సినిమాకే ఆమె నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు.

కేవలం రెమ్యునేషన్ మాత్రమే కాదు ఈ సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాదులో ఉండేందుకు మూవీ యూనిట్ అందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేయాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ అయ్యేంతవరకు ఆమె హైదరాబాదులోనే ఉండేలా మొత్తం ఖర్చును మూవీ యూనిటే భరించాలి. అందుకు కూడా చిత్ర నిర్మాతలు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక మరోవైపు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ హీరో విక్రమ్ అలాగే బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ లను దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5 2024 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: