నాచురల్ స్టార్ నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా.. కృష్ణాజిల్లా చల్లపల్లి లో 1984 ఫిబ్రవరి 24న జన్మించారు నాని. ఇక నాని చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు హైదరాబాదులో స్థిరపడ్డారు.చదువు పూర్తయిన తర్వాత ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతోనే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సరే గతంలో శ్రీను వైట్ల, బాపూ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి.. ఆ తర్వాత హైదరాబాదులో కొన్ని రోజులపాటు రేడియో జాకీగా కూడా నాని పనిచేశారు. ఒకానొక సమయంలో వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో అవకాశాలు ఉన్నాయని తెలిసి ఆడిషన్స్ కి వెళ్ళిన ఈయనకు.. ఇందులో నటించే అవకాశం వచ్చింది.

సినిమా మంచి విజయం సాధించడంతో పలు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత నాని రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈగ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు..  ముఖ్యంగా ఇప్పుడున్న హీరోలలో నాని తన నటనతో నాచురల్ స్టార్ గా పిలువబడుతున్నారు అంటే ఆయన నటన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. 2015 మొదట్లో  ఎవడే సుబ్రహ్మణ్యం మొదలుకొని 2017 లో వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం వరకు వరుసగా 8 విజయాలను అందుకొని స్టార్ హీరోగా మారిపోయారు.


నటుడు సహాయ దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా 2014లో నిర్మాతగా డి ఫర్ దోపిడి అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆ! అని చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇక 2018లో ఏప్రిల్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించారు అయితే అది సక్సెస్ కాకపోయేసరికి మాటీవీలో ప్రసారమైన బిగ్ బాస్ 2 రియాల్టీ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2018లో నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమాలో నటించిన 2019లో వచ్చిన జెర్సీ సినిమాతో ఓవర్ నైట్ లోనే మరింత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరొకవైపు ఆయన నటించిన దసరా సినిమా కూడా సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD