అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట ఈమె బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్  సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ను అందుకోలేక పోయినప్పటికీ గంజాన్ సక్సేన, గుడ్ లక్ జెర్సీ, మిలి వంటి సినిమాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది జాన్వీ కపూర్. అంతేకాదు కద అంశాల నవ్యతకు ప్రాధాన్యం ఇచ్చే నాయకగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అయితే గత కొంతకాలంగా ఈమెకి సంబంధించిన పలురకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 

అందులో భాగంగానే జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరియు కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఒక సినిమాలో జాహ్నవి కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం ఈ బాలీవుడ్ బ్యూటీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తుంది అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ సినిమాకి జాన్వి కపూర్ ఐదు కోట్ల రెమ్యూనికేషన్ తీసుకుంది అని తాజాగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలలో ఈమె నటించినప్పటికీ తెలుగులో మాత్రం ఈమెది ఇది మొదటి సినిమా. హిందీలో తనకున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ను జాహ్నవి కపూర్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా ఐదు కోట్ల పారితోషకాన్ని ఇప్పటివరకు తీసుకున్నది లేదు. ఈ క్రమంలోనే మొదటి సినిమాకి భారీ మొత్తంలో జాహ్నవి కపూర్ డిమాండ్ చేయడంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: