కమలహాసన్.. ఈనను అభిమానులందరూ లోకనాయకుడు అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఈయన విలక్షణ నటుడు ఎలాంటి పాత్రకైనా సరే ప్రాణం పోయగలడు. అంతేకాదు మంచి రైటర్ కూడా.. ఇక తన గాత్రంతో కూడా ఎన్నో పాటలు పాడి అభిమానులను అలరించాడు. ఇక ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా కూడా వ్యవహరించాడు. అంతే కాదండోయ్ ఇక డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా కమలహాసన్ పనిచేశాడు. అందుకే ఈయనను విలక్షణ అనే పదానికి చిరునామాగా చెబుతూ ఉంటారు ఎంతో మంది సినీ  పండితులు. బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన ఇక ఇప్పుడు యూనివర్సల్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 తెలుగు తమిళం కన్నడం హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు కమలహాసన్. ఇక ప్రొఫెషనల్ లైఫ్ లో ఆయన తోపు అని చెబుతూ ఉంటారు. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం కమల్ హాసన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అని చెప్పాలి.  అధికారికంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన.. ఒక సహజీవనం కూడా చేశారు. అయితే ఇక కమలహాసన్ పర్సనల్ లైఫ్ లో చాలామందికి తెలియని రహస్యాలు కూడా ఉన్నాయి. కమల్ హాసన్ మొదట్లో హీరోయిన్ శ్రీవిద్యను ప్రేమించానని చెప్పాడట. పెళ్లి కూడా చేసుకుంటానని మాట ఇచ్చారట.



 ఈ విషయం ఎవరో చెప్పడం కాదు స్వయంగా హీరోయిన్ శ్రీవిద్య ఒకానొక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివిల్  చేసింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. మా రెండు కుటుంబాలు కూడా చాలా ఏళ్లుగా ఒకరికి ఒకరు తెలుసుకున్నాయ్. ఇక కమలహాసన్ నామీద ప్రేమను వ్యక్తపరిచాక ఆయనను ఆరాధించడం మొదలు పెట్టాను. ఆయన కోసం బ్రతకాలని అనుకున్న. నా జీవితం మొత్తం ఆయనకే అంకితం చేయాలనుకున్న. కానీ ఆ రోజు రాలేదు. హఠాత్తుగా ఓ రోజు వచ్చి ఓ డాన్సర్ను ( కమల్ హాసన్ మొదటి భార్య వాణి గణపతి) కమల్ హాసన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది.


నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. పెళ్లి జరగాల్సిందే. కానీ నా కోసం ఎదురుచూడు అన్న ఆ హీరో మాటలు ఇప్పటికీ నాకు గుర్తే ఉన్నాయి అంటూ ఓ ఇంటర్వ్యూలో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చింది హీరోయిన్స్ శ్రీవిద్య. ఆ తర్వాత కమల్ హాసన్ తో బ్రేకప్ అయ్యాక మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన జార్జ్ దామస్ను పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి వీరిద్దరూ కూడా విడిపోయారు. జార్జ్ తామస్ మరో పెళ్లి చేసుకున్నారు. అంతలోనే  శ్రీవిద్య క్యాన్సర్ బారిన పడింది. చివరికి క్యాన్సర్ తో పోరాడుతూ 2006 ఆగస్టు 17వ తేదీన కన్ను మూసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: