తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ... అందులో ఎన్నో మూవీ ల ద్వారా బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకుడుగా కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు ఆకరుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందినటువంటి సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్ ఇండియా పాన్ మూవీ కి దర్శకత్వం వహించి ... ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు.

ఇలా సైరా నరసింహా రెడ్డి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్న ఈ క్రేజీ దర్శకుడు ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్నటువంటి ఏజెంట్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా ఈ దర్శకుడు పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బిజినెస్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క ఆంధ్ర ... సీడెడ్ ... నైజాం ... కర్ణాటక హక్కులను ఈ మూవీ నిర్మాణ సంస్థ వైజాగ్ గాయత్రి ఫిలిమ్స్ సంస్థకు అమ్మివేసినట్లు సమాచారం. ఈ సంస్థ ఈ మూవీ యొక్క ఆంధ్ర ... సీడెడ్ ... నైజాం ... కర్ణాటక హక్కులను భారీ ధరకు ఈ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: