మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ద్వారా రామ్ చరణ్ కు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా లభించాయి. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియాలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ప్రస్తుతం హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జై సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ ... అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ సినిమా బృందం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతు ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ యూనిట్ జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మార్చి 27 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ... ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: