
ఒక చిత్రానికి దాదాపుగా రూ.70 నుంచి రూ.80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు అభిమానులు మాత్రం ఎప్పుడూ మొదలైన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తికాలేదు కానీ వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోవడంతో చాలా గందరగోళంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ తో ఒక సినిమా, సముద్రఖని తో మరొక సినిమా, హరిశంకర్ తో మరొక సినిమా ఇలా నాలుగు సినిమాలు షూటింగ్ పూర్తి చేయకుండా కేవలం కమిట్మెంట్ అవుతూ ముందుకు వెళ్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాలు కమిట్మెంట్లను ముగించిన తర్వాతే రాజకీయాలలోకి వెళ్లాలని సూచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఏకీభవిస్తారా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.
మరొక కొద్ది రోజుల్లో వారాహి ద్వారా ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లుగా తెలియజేశారు పవన్ కళ్యాణ్. కానీ ఒకవైపు సినిమాలలో నటించకుండా కేవలం ఎక్కువగా రాజకీయాల వైఫై ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సగం వరకు పూర్తి చేసిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా రెండు పాటలు మిగిలిన షెడ్యూల్సు పూర్తి చేస్తే ఈ సినిమా పూర్తి అవుతుందన్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు సహకరించలేదు అన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ మేరకు అభిమానుల మాట వింటారో చూడాలి మరి.