నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇది వరకే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేయగా ... ఆ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ప్రచారాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ తమిళ్ వర్షన్ కు సంబంధించిన పబ్లిసిటీ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా తమిళ్ వర్షన్ పబ్లిసిటీ చేసేందుకు గాను ఈ మూవీ నుండి ఒక పాటను చెన్నై లో లాంచ్ చేయాలి అని ఈ మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా బృందం తమిళ్ వర్షం పబ్లిసిటీ కోసం ఇలా పక్కా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నాని పక్క ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని తన ఊర మాస్ లుక్ తో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: