
ఈ వీడియోలో మ్యూజిక్ వింటే ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం అవుతుంది .ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఫస్ట్ లుక్ ఎప్పుడు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు .ఈ సినిమా స్టువర్టపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చాలా ఆసక్తి రేపేలా కనిపిస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా తెలుగు కన్నడ హిందీ వంటి భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
వాస్తవానికి దొంగలకు కూడా బయోపిక్ తీస్తారా అనే సందేహాలు అందరిలోనూ కలగవచ్చు. బాలీవుడ్ లో ఇప్పటికే ఈ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది నేరస్తులు వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్న అనేకమంది వారి యొక్క బయోపిక్ తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఈ కథాంశంతోని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒక సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్లు గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ నటిస్తున్నారు ఇందులో కీలకమైన పాత్రలో అనూపమ్ కేర్, రేణు దేశాయ్ వంటి వారు కూడా నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.