టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో బంగార్రాజు అనే మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో వీరిద్దరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

ఇలా మంచి ప్రశంసలను అందుకున్న ఈ జోడి మరో సారి కష్టడి మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు కొంత కాలం క్రితం శింబు హీరోగా రూపొందిన మానాడు అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ప్రారంభం అయినా కస్టడీ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులను నాగ చైతన్య ప్రారంభించాడు. 

ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను కూడా ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కెరియర్ లో మొట్ట మొదటి సారి నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: