
అయితే ఇక ఇటీవలే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నాము అంటూ ప్రకటించారు. ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు కూడా వధూవరుల వేషధారణలో ఉండడం గమనార్హం. తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుని బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగినట్లు వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తే తెలుస్తుంది. అయితే ఇక స్వయంగా నరేష్ ఈ వీడియోని బయట పెట్టడంతో ఇదంతా నిజమే అని నమ్మారు అందరూ. కానీ ఈ పెళ్లి అంతా తూచ్ అంటూ ఇక ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
నిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్న ఒక సినిమా షూటింగ్లో భాగంగానే ఈ పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించారు అంటూ ఒక టాక్ తెగచక్కర్లు కొడుతుంది. ఈ వీడియో మొత్తం సినిమా షూటింగ్ కి సంబంధించింది అన్నది తెలుస్తుంది. పవిత్ర, నరేష్ ఇద్దరు హీరో హీరోయిన్లుగా ఒక లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలోనే సినిమాలో భాగంగానే ఈ పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఒకవేళ నరేష్, పవిత్ర లోకేష్ నిజంగానే పెళ్లి చేసుకుంటే.. వీడియో బయటకు వచ్చిన కాసేపటికే ఇంటింటి రామాయణం అనే మూవీ ప్రెస్ మీట్ లో నరేష్ ఎలా పాల్గొంటారు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు పెళ్లి జరగగానే నరేష్, పవిత్ర లోకేష్ హనీమూన్ వెళ్లిపోయారంటూ మరికొన్ని వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఏది నిజమో తెలియక అందరూ కన్ఫ్యూజన్లో మునిగిపోతున్నారు.