తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈ దర్శకుడు షాక్ మూవీ తో దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిరప కాయ్ మూవీ తో మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల వరసలో చేరిపోయాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ క్రేజీ దర్శకుడు గద్దల కొండ గణేష్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఈ క్రేజీ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని తెరకెక్కించ బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.

మైత్రి సంస్థ వారు నిర్మించనున్న ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించనుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగ వంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ ను కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: