పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత తిరిగి వకీల్ సాబ్ మూవీతో సినిమా ఇండస్ట్రీ లోకి పవన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో పవన్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత భీమ్లా నాయక్ మూవీ లో పవన్ హీరోగా నటించాడు. ఈ మూవీ తో కూడా పవన్ అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే పవన్ "భీమ్లా నాయక్" తో పాటే హరిహర వీరమల్లు మూవీ ని కూడా ప్రారంభించాడు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొంత కాలం పాటు నిలిచిపోయింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయింది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్నాడు.

ఇలా ఉంటే ఈ మూవీ లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు ... ముఖ్యంగా ఈ మూవీ లోని ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ లో క్లైమాక్స్ ముందు ఒక సాంగ్ రాబోతున్నట్లు ... ఈ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నట్లు ... ఈ సాంగ్ కోసం ఈ మూవీ యూనిట్ ప్రత్యేకంగా ఒక సెట్ ను నిర్మిస్తున్నట్లు ... ప్రస్తుతం నిర్మిస్తున్న ... ఈ సెట్ వర్క్ ఈ నెల నాలుగో వారంలో పూర్తి కానున్నట్లు ... వచ్చే నెల మొదటి వారం నుండి ఈ సాంగ్ ను షూట్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: