తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో నాచురల్ స్టార్ నాని మరియు విజయ్ దేవరకొండ కూడా ఉంటారు. వీరిద్దరూ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టైర్ 2 హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ "లైగర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... అనన్య పాండేమూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ కూడా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 59 నిమిషాల్లోనే 100 కే లైక్స్ ను సాధించింది. టైర్ 2 హీరోలలో ఇదే అత్యంత వేగంగా 100 కే లైక్స్ ను సాధించిన ట్రైలర్ గా నిలిచింది.

ఇది ఇలా ఉంటే నాని తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ నిన్న తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ ట్రైలర్ టైర్ 2 హీరోలు విజయ్ దేవరకొండ మూవీ ట్రైలర్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ 70 నిమిషాల్లో 100 కే లైక్స్ సాధించి విజయ్ సినిమా ట్రైలర్ ను బీట్ చేయలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: