ఆస్కార్ అవార్డు వేడుకలలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ అందరికంటే ముందుగా హైదరాబాద్ కు తిరిగి రావడం జరిగింది. ఈ రోజున తెల్లవారుజామున హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ఎన్టీఆర్ కు ఆయన అభిమానులు చాలా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. హాలీవుడ్ ప్రముఖులతో ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లి వచ్చిన తెలుగు స్టార్ హీరోలలో ఎన్టీఆర్ కూడా నిలవడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.


అయితే ఎన్టీఆర్ తో rrr చిత్ర బృందం కూడా అమెరికాకు వెళ్లడం జరిగింది.కానీ వారు ఇంకా అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎన్టీఆర్ మాత్రం ఎందుకో అప్పుడే హైదరాబాద్కు తిరిగి రావడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ఇలా ఎందుకు చేశారనే విషయం అందరిలోనూ అనుమానాలను రేకెత్తేలా చేస్తోంది. అయితే ఎన్టీఆర్ హైదరాబాదుకి త్వరగా రావడం వెనుక కొరటాల శివ హస్తం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొరటాల శివతో సినిమా చేయబోతున్నారు కనుక ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాల్సి ఉంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా సినిమా కోసం ఫొటోస్ నిర్వహిస్తున్నారు అందుకే ఎన్టీఆర్ ఇలా ముందుగా హైదరాబాదులోని ల్యాండ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలో రామ్ చరణ్ సినిమాకు కూడా షూటింగ్ కార్యక్రమాలు లేవు అందుకే ఆయన ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నారని తెలుస్తోంది. ఇక రాజమౌళి కీరవాణి కూడా త్వరలోనే అమెరికా నుండి హైదరాబాద్ కు తిరిగి రాబోతున్నారు. ఎన్టీఆర్ కొత్త సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఆ వెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎన్టీఆర్ 30 వ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA