పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అదిరిపోయే స్పీడ్ లో సినిమాలను ఓకే చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ కి ... సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే మూవీ కి ... సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతం రీమెక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లోనే ఇందులో రెండు మూవీ ల షూటింగ్ లను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభించ బోతున్నట్లు సమాచారం.

మూవీ షూటింగ్ కోసం కొన్ని రోజుల కేటాయించిన తర్వాత సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే "ఓ జి" మూవీ లో కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే నెలలో ఈ మూవీ కి కూడా కొన్ని రోజులను పవన్ కేటాయించనున్నట్లు సమాచారం. ఇలా వచ్చే నెలలో ఈ రెండు మూవీ ల షూటింగ్ లలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లపై పవన్ అభిమానులతో పాటు మామూలు  సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: