
ఈ మూవీ మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ కీలక పాత్రలలో నటించనుండగా ... రాహుల్ సిప్లిగంజ్ , అనసూయ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ... ట్రైలర్ మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
ఈ మూవీ లోని ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 33 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మంచి అంచనాల నడుమ విడుదలకు రెడీగా ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.