మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన వాల్టేర్ వీరయ్య మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బ్లాక్ బస్టర్ మూవీ కి బాబి కొల్లి దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మాస్ మహారాజా రవితేజమూవీ లో మరో కీలకమైన పాత్రలో కనిపించాడు.

క్యాథరిన్ ఈ సినిమాలో రవితేజ కు భార్య పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే వాల్టేర్ వీరయ్య మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సక్సెస్ ను అందుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

తాజాగా చిరంజీ వి హీరో గా రూపొందుతున్న భోళా శంకర్ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం మహేష్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని కూడా ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనితో ఈ రెండు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: