పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ దర్శకులలో ఒకరు అయినటు వంటి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే "ఓ జి" అనే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. అలాగే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి ఇప్పటికే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ టైటిల్ అలాగే చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ మొదలు కాక ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు ఈ సినిమా షూటింగ్ లొకేషన్ ల కోసం వెతుకులాటలో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక కేజీ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఏప్రిల్ నెలలోనే ప్రారంభించ బోతున్నట్లు తెలుస్తోంది. కాక పోతే పవన్ కళ్యాణ్ లేకుండా ఈ మూవీ ని ఏప్రిల్ నెలలో మొదలు పెట్టనున్నట్లు ... ఆ తర్వాత మే నెలలో పవన్ కళ్యాణ్మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు పవన్ కళ్యాణ్ లేకుండా వచ్చే సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని సుజిత్ గ్యాంగ్ స్టార్ కథతో రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: