చిన్న పెద్ద సినిమా లని తేడా లేకుండా సినిమాలు విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. స్టోరీ పరంగా సినిమా బాగుంటే చిన్న పెద్దాయన తేడా లేకుండా మంచి విజయాలను అందుకుంటున్నాయి.ఈమధ్య అలాంటి సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక తాజాగా హీరో అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా సూపర్ హిట్ కావడంతో అదే జోనర్ తో మళ్ళీ తమ తదుపరి చిత్రాలను కూడా ప్రారంభించారు. అలా ఉగ్రం పేరుతో ఒక సినిమాని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్ విజయ్ కనకమెడల.


మొదట సినిమా సూపర్ హిట్టు కావడంతో రెండవ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాల్సి ఉండగా కానీ అదే రోజున సమంత నటించిన శాకుంతలం  సినిమా విడుదల అవ్వనుంది. ఇక తమిళ సినీ పరిశ్రమ నుంచి రుద్రుడు, బిచ్చగాడు అంటే సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఉగ్రం సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్లుగా చిత్ర ఇల్లు అధికారికంగా ప్రకటించారు. మే 5వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు సమాచారం.


తాజాగా ఈ సినిమా విడుదల చేసిన పోస్టర్లు అల్లరి నరేష్ రక్తపు మరకలతో ఉన్న షర్ట్ ధరించి భుజాల మీద ఒక రౌడిని వేసుకొని వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక రకంగా ఇప్పటివరకు అల్లరి నరేష్ కేవలం కామెడీ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు.. ఇప్పుడు కాస్త సీరియస్ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పోస్టర్లో ఆయన ఉగ్రంగా కనిపిస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాస్తవానికి మే 5వ తేదీన గోపీచంద్ నటించిన రామబాణం సినిమా కూడా విడుదలవుతోంది ఈ సినిమాని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. మరి అల్లరి నరేష్ గోపీచంద్ మధ్య గడ్డి పోటి నిలబడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: