టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది తమన్నా. ఇండస్ట్రీలో ఉన్న ఆగ్రహీరోలందరితో నటించి అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు కూడా అదే జోరుని కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలుగు తో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా. నిజానికి వీళ్లిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. అయితే ఈమధ్య ఈ జంట కలిసి చేసే పనులు అభిమానులను షాక్ కి గురి చేస్తున్నాయి. 

ఈమధ్య తమన్నా విజయ్ వర్మ తో కలిసి బయట ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని ఇప్పటికే కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ జంట ఎన్నోసార్లు కెమెరా కంటికి చిక్కారు. ఓసారి అయితే ఏకంగా తమన్న విజయవర్మను కిస్ చేస్తున్న వీడియో కూడా తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు వరకు ఈ ఇద్దరూ తమ రిలేషన్ గురించి స్పందించలేదు. తాజాగా మరోసారి ఇద్దరూ జంటగా డిన్నర్ కి వెళ్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విజయ్ వర్మ కారు డ్రైవర్ సీట్ లో కూర్చుని ఉండగా తన పక్కనే తమన్న కనిపించింది.

 డిన్నర్ కు వెళ్లి వచ్చిన అనంతరం తమన్న విజయవర్మ కార్ దిగి అతని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. దీంతో విజయ్ వర్మతో తమన్నా నైట్ డేట్ లో కనిపించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో కింద నెటిజన్లు అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే కాఫీ డికాషన్ లా ఉన్నారని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏమో విజయ వర్మ తమన్నాకు సరైన జోడి కాదని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది ఏమో వీళ్ళిద్దరూ నిజమైన ప్రేమ జంటల్లా ఉన్నారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ మధ్య తరచూ విజయవర్మతో తమన్న ఇలా బయటకి వెళ్తుండడంతో ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'భోళాశంకర్' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: