సిల్క్ స్మిత.. ఈ పేరు చెబితే చాలు సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతలా ఉర్రూతలూగిపోతారో అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నేటితనం ప్రేక్షకులకు ఇక ఈమె గురించి కాస్త తక్కువే తెలిసి ఉంటుంది. కానీ నిన్నటి తరం ప్రేక్షకులను అడిగితే మాత్రం సిల్క్ స్మిత క్రేజ్ ఏంటి అన్నది చెబుతూ ఉంటారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్గా ఒక వెలుగు వెలిగింది సిల్క్ స్మిత. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో నటించడమే కాదు ఇక ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ ఐతే ఇప్పటికి కూడా ప్రేక్షకులు మరిచిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు.



 ఇలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన ఇండస్ట్రీ ని ఊపేసింది. అయితే సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించింది విజయలక్ష్మి. అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత సిల్క్ స్మిత కేవలం గ్లామర్ పాత్రలు చేయడంతో బయట కూడా ఆమెను అలాగే చూడటం మొదలుపెట్టారు ప్రేక్షకులు.  దీంతో సినిమాల్లో అందంగా కనిపించిన సిల్క్ స్మిత జీవితం మాత్రం నిజజీవితంలో ముళ్లపానుపుల మారిపోయింది.



 అయితే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సిల్క్ స్మితను చులకనగా చూడటం.. ఇక మరోవైపు సినిమాల ద్వారా ఆమె సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులను బంధువులే మోసం చేసి కొట్టేయడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. దీంతో 1996లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పాలి. సినీ ప్రముఖులు ఎవరు కూడా ఆమె భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లలేదు. అనాధలాగే ఆమె అంత్యక్రియలు జరిగాయి   కానీ యాక్షన్ హీరో అర్జున్ మాత్రం ఆమెను చివరిసారిగా చూసేందుకు వెళ్లారట. అయితే ఆయన  వెళ్లడానికి కారణం కూడా ఉందట. ఇండస్ట్రీలో అర్జున్, సిల్క్ స్మిత మంచి స్నేహితులట. అయితే నేను చనిపోయినప్పుడు నువ్వు నన్ను చూడడానికి వస్తావా అని బతికున్నప్పుడు సిల్క్స్ మీద అడిగారట. అందుకే ఆమె చివరి కోరిక తీర్చడానికి అర్జున్ ఇక ఆమె భౌతిక కాయాన్ని చూసేందుకు వెళ్లారట.

మరింత సమాచారం తెలుసుకోండి: