తమిళం తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలలో బిచ్చగాడు సినిమా కూడా ఒకటి. తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమాకి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో తల్లి ప్రాణం కోసం కొడుకు పడే ఆరాటం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కంటతటిని తెప్పిస్తుంది.డబ్బింగ్ రూపంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.ఈ సినిమాతో విజయ్ కి మరింత గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.ఈ సినిమాలో సాట్నా టైటస్ హీరోయిన్గా నటించడం జరిగింది. మొదటి సినిమాతోనే తన నటనతో అందంతో ఎందరో అభిమానులను కట్టిపడేసింది ఈమె. 

సినిమా తర్వాత ఆమెకి అటు కోలీవుడ్ లోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం మంచి గుర్తింపు లభించింది.  ఈ సినిమా అనంతరం యీథవన్, నీది నాది ఒకే కథ, తిరుదుర కూటం సినిమాల్లో సైతం ఈమె నటించింది. ఈ సినిమాల్లో నటించిన అనంతరం ఈమె ఇండస్ట్రీకి దూరమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంది ఏం చేస్తుంది అని ఆరా తీయడం మొదలుపెట్టారు.. సాట్న 1991లో కేరళలోని కొచ్చిలో పుట్టింది. తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నటనపై  ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి వచ్చింది .తెలుగులో బిచ్చగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాట్న. ఇక ఏ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తనకి మంచి గుర్తింపు లభించింది.

సినిమా అనంతరం సినిమాల్లో నటించిన ఈమె దాని అనంతరం పలు వివాదాలలో చిక్కుకొని ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉండేది. కెరియర్లో అప్పుడే మంచి ఫామ్ లో ఉన్న ఈమె బిచ్చగాడు సినిమాని తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తిని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ఆమెకి అతనితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి కొన్నాళ్ల తరువాత వీరిద్దరూ రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించాడు. ప్రస్తుతం ఈమె సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ కుటుంబంతో సమయాన్ని గడుపుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: