అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీ రేపు (అనగా ఏప్రిల్ 28 న )ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు అఖిల్ కి సరైన కమర్షియల్ హిట్ దక్కలేదు. అతని గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యావరేజ్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఇప్పుడు ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలను నెలకొన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా.. సినిమాలో అఖిల్ ఇండియన్ సీక్రెట్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ కోసం అఖిల్ తన లుక్ ని పూర్తిగా మార్చిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో 8 ప్యాక్ బాడీ, బీస్ట్ లుక్ తో వావ్ అనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి పాత్ర పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏజెంట్ సినిమాకి సెన్సార్ యూనిట్ ఏకంగా ఎనిమిది చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసిందట. రెగ్యులేటరీ గైడ్లైన్స్ కు అనుగుణంగా మూవీ లేకపోవడంతో ఇందులో కొన్ని బూతు పదాలను మ్యూట్ చేశారట.

అంతేకాకుండా ఆడియన్స్ పై ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్ పడకుండా ఇక ఇంకా రెండు వైలెన్స్ సీన్లను కూడా బ్లాక్ చేసేసారట. సినిమాలో ప్రధానంగా నిలిచే ఈ యాక్షన్ సీన్స్ ని ఇలా బ్లాక్ చేయడం ఏజెంట్ మూవీ టీమ్ కి భారీ షాక్ అనే చెప్పాలి. ఇక 156 నిమిషాల రన్ టైం తో వస్తున్న ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికెట్ను జారీ చేసింది. కాగా అఖిల్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సైరా నరసింహారెడ్డి సినిమాతో పరాజయం అందుకున్న సురేందర్ రెడ్డి ఆశలన్నీ ఏజెంట్ పైనే ఉన్నాయి. మరి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా అటు అఖిల్ కి ఇటు సురేందర్ రెడ్డి కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: