టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుంకర నిర్మించగా ... సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించగా  ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.95 కోట్ల షేర్ ...  8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.81 కోట్ల షేర్ ... 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.48 కోట్ల షేర్ ... 1.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ మూవీ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 6.24 కోట్ల షేర్ 11.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ వస్తువులు చేసిం ది.

మరింత సమాచారం తెలుసుకోండి: