టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో వచ్చిన బ్లాక్ మాస్టర్ మూవీస్ లో 'మహర్షి' కూడా ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగా.. ప్రకాష్ రాజ్, జయసుధ, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు అల్లరి నరేష్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. 

అప్పటివరకు కామెడీ సినిమాలకి పరిమితమైన అల్లరి నరేష్ మహర్షి సినిమా ద్వారా తనలోని అసలైన నటుడ్ని ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ఈ సినిమాలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ రవి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించాడు అల్లరి నరేష్. ఫ్రెండ్షిప్ కోసం అలాగే తనని నమ్ముకున్న వాళ్ళ కోసం కెరియర్ ని మరియు ప్రాణాలను సైతం లెక్కచేయని వ్యక్తిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కామెడీని పక్కనపెట్టి సీరియస్ రోల్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అయితే నిజానికి ఈ సినిమాలో రవి పాత్రకు మొదటగా అనుకుంది అల్లరి నరేష్ ని కాదట. ముందుగా ఈ పాత్ర ఓ మెగా హీరో వద్దకు వెళ్లిందట.

కానీ ఆ మెగా హీరో రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి ధరం తేజ్. మహర్షి టైంలో సాయి ధరమ్ తేజ్ అప్పటికే వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అలాంటి టైం లో మహర్షి లో ఈ పాత్ర చేస్తే తేజ్ కి మంచి బూస్టింగ్ వస్తుందని వంశీ పైడిపల్లి భావించాడట. ఈ క్రమంలోనే మహర్షి కోసం సాయి తేజ్ ను సంప్రదించాడట. కానీ కొన్ని  రీజన్స్ వల్ల సాయి ధరమ్ తేజ్ రవి పాత్రను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం అల్లరి నరేష్ ని సెలెక్ట్ చేశారు. కట్ చేస్తే.. మహర్షి మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాదు.. అల్లరి నరేష్ కెరియర్ కి మంచి బూస్టింగ్ కూడా ఇచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: