లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి'. నిన్ను కోరి, మజిలీ వంటి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇందులో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ అందమైన ప్రేమ కథ చిత్రం గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని,వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి..

తాజాగా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. ఈ సినిమా స్టోరీ మొత్తం ఫ్లాష్ బ్యాక్ తోనే ఉంటుందట. అంతేకాదు క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్లలో ఒక పాత్ర చనిపోతుందట. 'చావు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఉన్నంతకాలం ప్రతి ఒక్కరు ఖుషి గా బ్రతకాలి' అనే సందేశం తో ఈ సినిమాని ముగిస్తారని సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు జోరుగా ప్రచారం అవుతుంది. ఒకవేళ నిజంగానే ఖుషి మూవీ క్లైమాక్స్ లో ఇటువంటి సాడ్ ఎండింగ్ ఉంటే..

దాన్ని అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇటు సమంత ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక నవంబర్ 1న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై అటు విజయ్ దేవరకొండ ఇటు సమంత భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. అందుకే ఈ సినిమా హిట్టవ్వడం ఇటు విజయ్ కి అటు సామ్ కి చాలా ఇంపార్టెంట్. మరి రిలీజ్ తర్వాత మూవీ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: