
చిరంజీవి అయితే నేరుగా నాతో సినిమా ఎప్పుడు పూరీ అని అడిగారు.. మంచి కథ సిద్ధం అయితే త్వరలోనే కలుస్తానని కూడా చెప్పారట. అయితే ఇంతవరకు ఆ ప్రాజెక్టు సంగతి ఎక్కడ రివీల్ చేయలేదు.. మరొకవైపు బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అందులో కూడా నిజం లేకపోయింది అయితే ఇప్పుడు ఆయన కొత్త సినిమా విషయంలో మరొక కొత్త చర్చ తెరపైకి వచ్చింది.. అటు తిరిగి ఇటు తిరిగి పూరీ జగన్నాథ్ మళ్లీ రామ్ పోతినేని దగ్గరికి వెళ్లినట్లు సమాచారం.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే మళ్లీ వీరిద్దరూ ఒక సినిమా చేస్తున్నారని డబుల్ ఇస్మార్ట్ అంటూ ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేశారు చిత్ర బృందం.. అంతేకాదు మహాశివరాత్రి సందర్భంగా 2024 మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా కూడా ఆదివారం ప్రకటించడం జరిగింది. ఇది ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అన్నమాట.. ఇందులో రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వస్తోంది. మరి ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.