బోయపాటి శ్రీను గురించి మనందరికీ బాగా తెలిసిందే. తెలుగులో ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను కూడా అందించారు బోయపాటి.బాలయ్య బాబు హీరోగా నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని తో సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆ రేంజ్ లో మాస్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేనిసినిమా కోసం భారీగా బరువు పెరిగే అవతారం మార్చుకున్నాడని తెలుస్తుంది.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోందట.ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారట మూవీ మేకర్స్. కానీ ఆ టీజర్ లో అసలు పేరు లేకుండా దర్శకుడు కాంబోలో బోయపాటి రాపో అనే వీడియోని అయితే విడుదల చేశారు. ఇలా విడుదల చేయడం కూడా మొదటిసారి. ఆ టీజర్ లో రామ్ పోతినేని పవర్ ఫుల్ లుక్స్ ని కూడా రివిల్ చేశారు. ఆ వీడియోలో విలన్ ని ఛాలెంజ్ చేస్తూ నీ గేటు దాటా స్టేటు దాటా ఇంకా ఏంట్రా లిమిట్స్ అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగుని కూడా చూపించారు. ఒక్క ఫ్రేమ్ లో శ్రీలీలని చూపించగా, చుట్టూ రౌడీ గ్యాంగ్ తప్ప ఇంకెవరినీ కూడా ఓపెన్ చేయకుండా తెలివిగా కట్ చేశారు. రామ్ ను మునుపెన్నడూ కూడా చూడని ఊర మాస్ వేషంలో మోటుగా అయితే ఉన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ టీజర్ లో హీరో రామ్ పోతినేని చెప్పిన డైలాగ్ బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ మాదిరిగానే ఉంది అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. నీ ఇంటికి వచ్చా నట్టింటికి వచ్చా అనే బాలయ్య డైలాగ్స్ ని పోలి ఉన్నాయి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కాగా ఈ సినిమాను అక్టోబర్ లో దసరా పండుగకు కానుకగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఏంటి అనేది ఇప్పటి వరకు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు బోయపాటి.

మరింత సమాచారం తెలుసుకోండి: