ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య అంటే తెలియని వారు ఉండరు. సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న నటీమణుల్లో సావిత్రి తరువాత సౌందర్య అంతటి పేరు తెచ్చుకుంది. ఆమె అందం అభినయం నటనతో ఎందరినో తన అభిమానులను చేసుకుంది సౌందర్య. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక అలాంటి సౌందర్య తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సైతం వరుస సినిమాలను చేసింది. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె చేసిన సినిమాల రూపంలో ఎప్పటికీ మన కళ్ళ ముందే కనిపిస్తుంది. 

ఇదిలా ఉంటే ఇక సౌందర్య నటించిన సూపర్ హిట్ సినిమాల్లో అంతఃపురం సినిమా కూడా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయికుమార్ సౌందర్య కలిసి నటించారు. కాగా ప్రకాష్ రాజ్ జగపతిబాబు మరియు మరికొందరు కీలక పాత్రలో కనిపించారు. 1998లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో సౌందర్య చిన్న వయసులోనే తన భర్తను పోగొట్టుకుంటుంది. కొడుకును రక్షించేందుకు తబన పడే తల్లి పాత్రలో మెరిసింది సౌందర్య. ఇక ఈ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది ఆమె.  ఈ సినిమాలో సౌందర్య కి కొడుకుగా కనిపించిన బుడ్డోడి పేరు కృష్ణ ప్రదీప్.

 ఈ సినిమాలో నటించే సమయానికి అతని వయస్సు కేవలం రెండేళ్లు మాత్రమే. ఇక ఇప్పుడు ఆ బుడ్డోడు చాలా పెద్దవాడు అయిపోయాడు. ఈ సినిమాలో నటించిన తర్వాత అతను మరే  సినిమాలో కూడా కనిపించలేదు. అతని చదువులపై ఎలాంటి ఎఫెక్ట్ పడకూడదని కృష్ణ ప్రదీప్ తల్లిదండ్రులు అతనిని సినిమాలకు దూరం పెట్టారు. ప్రస్తుతం కృష్ణ 27 సంవత్సరాలు. హీరోలకు ఏమాత్రం తీసుకుని కటౌట్ తో మెరిసిపోతున్నాడు కృష్ణ ప్రదీప్. అంతేకాదు సోషల్ మీడియాలో అతను సూపర్ యాక్టివ్గా ఉంటాడు. అతని ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకుంటాడు కృష్ణ ప్రదీప్. అయితే తాజాగా ఇప్పుడు కృష్ణ ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: