తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యబ్రహ్మ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం ఎన్నో వందల సినిమాలలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆయన నవ్వించారు.ఇలా బ్రహ్మానందం అద్భుతమై న కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షక అభిమానుల ను కూడా చాలామందిని సంపాదించుకున్నారు.

వందల సినిమాల లో నటించి ఎన్నో అవార్డుల ను పురస్కారాలను అందుకున్న బ్రహ్మానందం ప్రస్తుతం వయసు పైబడటంతో పూర్తిస్థాయి లో సినిమాల ను తగ్గించారని తెలుస్తుంది.. కథ ప్రాధాన్యత ఉన్న సినిమాల లో ఈయన నటిస్తూ ప్రేక్షకుల ను బాగా సందడి చేస్తున్నారు.

ఇకపోతే బ్రహ్మానందం సినీ కెరియర్ గురించి పక్కనపెట్టి ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన కు ఇద్దరు కుమారులన్న సంగతి మనకు తెలిసిందే. మొదటి కుమారుడు గౌతమ్ ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కూడా. పలు సినిమాలలో నటించిన గౌతమ్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇతర వ్యాపారాలలో స్థిరపడ్డారని తెలుస్తుంది.. ఇక ఈయనకు ఇంకో కుమారుడు కూడా ఉన్నారనే సంగతి చాలామందికి తెలియదు. ఈయన చిన్న కుమారుడు పేరు సిద్దార్థ్ ఈయన విదేశాలలో స్థిరపడ్డారు. తాజాగా ఈయన నిశ్చితార్థం ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందటా.. డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో  సిద్దార్థ్ నిశ్చితార్ధం జరిగిందని తెలుస్తుంది.. సిద్దార్ధ్కు కాబోయే భార్య ఐశ్వర్య కూడా డాక్టరే. ఇక వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని సమాచారం.ప్రస్తుతం వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందటా.. త్వరలోనే పెళ్లి తేదీని కూడా వారు ప్రకటించబోతున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి కాబోయే వధూ వరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో  బాగా వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్, బ్రహ్మానందం అభిమానులు కూడా కాబోయే వధూ వరులకు శుభాకాంక్షల ను తెలియజేస్తున్నారటా.

మరింత సమాచారం తెలుసుకోండి: