పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ సినిమాను 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నారు. కాగా ఈ సినిమాకి 1,000 కోట్ల రూపాయలకి పైగాని బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ సలార్ సినిమా ఖచ్చితంగా సంచలనాలను సృష్టిస్తుందని ఫిక్స్ అయ్యారు ప్రభాస్ ఫ్యాన్స్. కే జి ఎఫ్, కె జీ ఎఫ్  టు సినిమాలను మించి సలార్ సినిమా ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు ప్రశాంత్ నీల్ పెద్ద పీట వేశారని తెలుస్తోంది. అంతేకాకుండా సలార్ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ కి కూడా  క్రేజ్ పెరగడం ఖాయమని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు చాలామంది.

అయితే ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ ను వేరే లెవెన్ లో ప్లాన్ చేశారట దర్శకుడు. 400 మందితో ఫైట్ లతో ఈ సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఎవరి ఊహలకు అందని విధంగా ప్రభాస్ సినిమా క్లైమాక్స్ ఉండబోతుందట. అయితే ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ క్రేజీ సినిమాకి సీక్వల్ గా సలార్ టూ సినిమా కూడా ఉండబోతుందని వార్తలు సైతం వినపడుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఇక ఈ సినిమాలో ఆధ్యా రోల్లో నటిస్తోంది శృతిహాసన్.

ఇక ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందట. వీరిద్దరి కాంబినేషన్లో చాలా సీన్లు బాగుంటాయని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రభాస్సినిమా కోసం వంద నుండి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుని ఉంటాడు. అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: