ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒక హీరో కోసం రాసుకున్న కద మరొక హీరో దగ్గరకు వెళ్లడం సర్వసాధారణం. ఇక అలా ఒక హీరో కోసం అనుకున్న కద మరొక హీరో దగ్గరికి వెళ్లి ఆ సినిమా ఫ్లాప్ అయితే ఏం బాధ ఉండదు. కానీ అదే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటే గనుక అనవసరంగా ఆ సినిమాని మిస్ చేసుకున్నానే అంటూ బాధపడతారు స్టార్ హీరోలు. అలా టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో తన దగ్గరకు వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా కథను వదులుకున్నాడు. ఇక ఆ సినిమాని వేరొక స్టార్ హీరో ఆ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టాడు. 

ఇక ఇద్దరు స్టార్ హీరోలు మరెవరో కాదు అల్లు అర్జున్ ,ప్రభాస్. డైరెక్టర్ కరుణా కరణ్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆ సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అంతేకాదు ప్రభాస్ సినీ కెరియర్ను సైతం ఈ సినిమా ఒక మలుపు తిప్పింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కథను మొదటగా అల్లు అర్జున్ కి వినిపించాడట ఈ సినిమా డైరెక్టర్ కరుణాకర్.

ఆ సమయంలో అల్లు అర్జున్ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడట. అంతేకాదు ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయని అల్లు అర్జున్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడట.ఈ నేపథ్యంలో ఈ సినిమా చేయనని చెప్పాడట అల్లుఅర్జున్. దాంతో ఈ సినిమా డైరెక్టర్ కరుణాకర్ ప్రభాస్ కి స్టోరీ వినిపించడట. స్టోరీ విన్న ప్రభాస్సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. ప్రభాస్సినిమా చేసిన తర్వాత ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మీ అందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని బ్లాక్ బస్టర్ విజయ అని సొంతం చేసుకుంది ఈ సినిమా. ప్రభాస్ డార్లింగ్ సినిమా చేసిన తర్వాత ప్రభాస్ కి డార్లింగ్ ప్రభాస్ అన్న పేరు సైతం వచ్చింది. దీంతో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు ప్రభాస్. అంతేకాదు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ప్రభాస్ కాజల్ జంట కూడా అత్యద్భుతంగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: