భారత సినీ పరిశ్రమలో అద్భుతమైన గాయకుడుగా పేరు సంపాదించారు సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన పాడిన జానపద లేదని చెప్పవచ్చు 16 పైగా భాషలలో 40000 పైగా పాటలను పాడారు ఆయన గానానికి ఎంతటి వారైనా సరే మంత్ర ముగ్ధులు కావాల్సింది. బాలు గారు పాడిన ప్రతిపాటలో కూడా ఆయన మార్క్ ఉంటుందని చెప్పవచ్చు. ఏ హీరోకి ఆ హీరోకి తగ్గట్టుగా పాటలు పాడడం ఈయన స్పెషాలిటీ అన్ని భాషలలో కూడా ఇదే తరహాలో హీరోకి తగ్గట్టుగా పాటలు పాడుతూ మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పాడిన కొన్ని పాటలను బెస్ట్ 5 సాంగ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


గాన గంధర్వుడిగా దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి పాటలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. పలు చిత్రాలలో నటనపరంగా కూడా బాగానే ఆకట్టుకున్నారు ఈయన..

1). 1992లో వచ్చిన మంచి మనసులు చిత్రంలోని "జాబిల్లి కోసం ఆకాశమల్లే" అనే పాట అందరిని ఆకట్టుకుంది ఈ పాటలోని అద్భుతమైన లిరిక్స్ బాలు గారి గళం అందంగా జోడించింది.


2). చిరంజీవి హీరోగా నటించిన రుద్రవీణ సినిమాలోని "తరలిరాధ తనే వసంతం" అనే పాట మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

3). వెంకటేష్ రేవతి జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో నటించిన చిత్రం ప్రేమ సినిమాలోని పాట" ప్రియతమా నా హృదయమా"..

4). 1989లో నాగార్జున గిరిజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి సినిమా ఇప్పటికీ అంతే పాపులారిటీ సంపాదించింది ఇందులో.."ఓ పాపా లాలి"అనే సాంగ్ అందరినీ ఆకట్టుకుంది.

5). 1976 లో వచ్చిన మనుషులంతా ఒక్కటే సినిమాలోని" ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా" ఈ పాట అప్పట్లో ఒక ట్రెండు ని సెట్ చేసిందని చెప్పవచ్చు.

ఇవే కాకుండా కొన్ని సినిమాలోని పాటలు కూడా బాలు గారికి ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకువచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: