సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా మహేష్ తో పాటు పిల్లలు గౌతమ్, సితార లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. అలా సోషల్ మీడియాలో ఎంతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది నమ్రత. అయితే చాలా రోజుల తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీ తాజాగా ఓ పార్టీకి హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర్ పార్టీకి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. 

ఇక ఈ వేడుకలో పాల్గొన్న కొన్ని ఫోటోలను మహేష్ భార్య నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పార్టీ మొత్తంలో నమ్రత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం. ఈ పార్టీలో నమ్రత ధరించిన ప్రత్యేకమైన కుర్తాపైన ఇప్పుడు అందరి దృష్టి పడింది. దీంతో ఈ కుర్తా ధరపై సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. గ్రాఫిక్ డిజైన్తో కూడిన ఆ కుర్తా సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. దీంతో నమ్రుతా ధరించిన ఈ ప్రత్యేకమైన జార్జియో అర్మాని కుర్తా ధర తెలిసి నెటిజెన్స్ తో పాటు ఫాన్స్ సైతం షాక్ అవుతున్నారు. దీంతో నమ్రత వేసుకున్న కుర్తా అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం నమ్రత ధరించిన కుర్తాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో "గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.! ఇటీవల ఈ సినిమా నుంచి మాస్ స్ట్రైక్ పేరుతో విడుదలైన టైటిల్ అండ్ టీజర్ కి ఆడియన్స్ నుండి అనూహ్యస్పందన లభించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: