తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య మల్టీస్టారర్ చిత్రాలు బాగా పెరిగిపోతున్నాయి.  ఈ నేపథ్యంలో కిషోర్ కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాన్ మల్టీస్టారర్ గా ‘గోపాల గోపాల’ చిత్రం తెరకెక్కించారు.  ఈ చిత్రం బాలీవుడ్ లో పరేష్ రావల్, అక్షయ్ కుమార్ నటించిన OMG కి రిమేక్.  తనకు అన్యాయం జరిగిందని.. దానికి దేవుడే నష్టపరిహారం చెల్లించాలని లాయర్ గా వాదించే పాత్రలో వెంకటేష్ నటించారు.  ఇక ఆయన సమస్యను పరిష్కరించేందుకు ఏకంగా దివి నుంచి భువికి దిగి వస్తాడు శ్రీకృష్ణుడు.. ఈ పాత్రలో పవన్ నటించారు.  ఈ చిత్రంలో ఇద్దరూ పోటీ పడీ మరి నటించారు. అప్పట్లో ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. 

 

తాజాగా పవన్ కళ్యాన్ ‘పింక్’ రిమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.  పింక్ చిత్రం తెలుగు లో వకీల్ సాబ్ టైటిల్ గా ఈ మద్యే పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ ట్రెండ్ సృస్టించింది.  తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం.  ఇందుకు అన్నీ సిద్దం కూడా అయ్యాయి. ఆ తర్వాత హరీష్ శంకర్ తో మరో చిత్రంలో నటించబోతున్నారట.

 

 ఆ తరువాత కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో పవన్ చేయనున్నాడనేది తాజా సమాచారం.  ఇప్పటికే డాలీ వినిపించిన కథకి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. అయితే తమిళ్ లో అజిత్ నటించిన వీరమ్ చిత్రాన్ని తెలుగులో కాటమరాయుడుగా రిమేక్ చేశారు.  కానీ ఈ చిత్రం ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేక పోయారు.  మరి ముచ్చటగా మూడో చిత్రం తో హిట్ కొడతారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: