తెలుగు పండుగల్లో దసరా, సంక్రాంతి పండుగలు చాలా పెద్దవి. కుటుంబమంతా కలిసి చేసుకునే ఈ పండుగ రోజు ప్రెక్షకులను అలరించాలని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ కూడా ప్రయత్నిస్తాయి. అలానే స్టార్ మా తెలుగు ఆడియెన్స్ ను దసరా రోజు ఫుల్ ఎంటర్టైన్ చేసేలా షోలు చేస్తుంది. ఉదయం నుండి రకరకాల షోలతో అలరిస్తున్న స్టార్ మా బిగ్ బాస్ ను కూడా ఈ వారం స్పెషల్ గా ప్లాన్ చేసింది. హోస్ట్ గా నాగార్జున ప్లేస్ లో సమంత రావడమే ఓ స్పెషల్ ఎట్రాక్షన్ కాగా సమంతతో పాటు మరికొన్ని సర్ ప్రైజులు ప్లాన్ చేశారు.

సమంత హోస్ట్ గా ఆడియెన్స్ తో పాటు హౌజ్ మేట్స్ ను సర్ ప్రైజ్ చేసింది. ఇక హోస్ట్ గా సమంత రావడమే కాకుండా స్పెషల్ ఎట్రాక్షన్ గా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, కార్తికేయ పర్ఫార్మెన్స్ లు ఉన్నాయి. అంతేనా హైపర్ ఆదిని కూడా ఈ షోకి వాడేశారు. బిగ్ బాస్ షో మీద పంచులు వేసే ఆది కూడా పండుగ స్పెషల్ గా షోకి వచ్చాడు. అఫ్కోర్స్ కోరిన రెమ్యునరేషన్ ఇస్తే ఎవరైనా ఎక్కడికైనా రావాల్సిందే.

ఇక ఫైనల్ టచ్ గా అక్కినేని యువ హీరో అఖిల్ కూడా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ ఎంట్రీతో షోకి మరింత క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. వదినకు సపోర్ట్ గా అఖిల్ హౌజ్ మేట్స్ తో ఆడిపాడించాడు. మొత్తానికి నాగార్జున ఒక్కడు అబ్సెంట్ అయితే ఆయన కోసం ఫ్యామిలీ మొత్తం వచ్చారు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున అదరగొట్టగా ఆయన ప్లేస్ లో వస్తున్న సమంత ఎలా సందడి చేస్తుందో చూడాలి.            



మరింత సమాచారం తెలుసుకోండి: