అసలు విషయానికి వస్తే , 1991వ సంవత్సరంలో చిన తంబి సినిమా షూటింగ్లో ఉండగా, కుష్బూ కోసం ఆమె అభిమానులు గుడి కట్టారట. అప్పటికి కుష్బూ కు తమిళ్ చదవడం రాదు.. అంతే కాదు ఆమెకు పేపర్ చూసే అంత సమయం లేకపోవడం, ఒకపక్క సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉండడం జరిగేది. అంతే కాదు ఆమె సినిమా బిజీ షెడ్యూల్ తో తన జీవితాన్ని కొనసాగిస్తోంది.. అప్పటికీ తన కోసం తన అభిమానులు గుడి కట్టించారు అనే విషయం తెలియదట. కొంతకాలం తర్వాత ఎవరో ఒక వ్యక్తి సెట్ లో కుష్బూ కోసం ఏకంగా తిరుచ్చిలో గుడి కట్టారట అని చెప్పడంతో ఆమె ఒక్క సారిగా షాక్ కు గురయింది. అంతేకాదు ఆమెకు తెలిసే సమయానికి రెండు సంవత్సరాలు కూడా పూర్తయి పోయిందట.
కానీ ఎంతో అభిమానంతో ఖుష్బూకి గుడి కట్టిన వారే ఆమె గుడిని కూల్చివేయడం కూడా జరిగిందట.. ఇందుకు గల కారణం ఏమిటి అంటే..స్త్రీ స్వేచ్ఛ, యువతులకు సెక్స్ ఎడ్యుకేషన్, పెళ్లి కాకముందే సెక్స్ వంటి అంశాలపై అప్పట్లోనే కుష్బూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన ఆమె అభిమానులు.. వారి చేతులతోనే ఖుష్బు కు నిర్మించిన గుడిని కూల్చివేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి