ప్రస్తుతం టాలెంట్ ఉన్న వారిదే టాలీవుడ్ ఇండస్ట్రీ అని తడుముకోకుండా చెప్పగలము. ప్రతిభ నిరూపించుకున్న వారి చుట్టూనే అవకాశాలు తరుముకు వస్తున్నాయి. యాంకర్ కం, యాక్టర్ కం, హీరోయిన్ కం, విలన్ కం ఇలా మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా గుర్తింపు తెచ్చుకుని కెరియర్ లో స్పీడ్ పెంచింది అనసూయ భరద్వాజ్.  జబర్దస్త్ అనే కామెడీ షోతో యాంకర్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనసూయ ఇప్పుడు బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలతో అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతోంది. రష్మి గౌతమ్ ఈమె ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయింది. అయితే ఈమెకు కూడా జబర్దస్త్ షో బ్రేక్ త్రూ అనే చెప్పాలి. ఇపుడు ఈమె కూడా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.

వెండితెరపై గుంటూరు టాకీస్ సినిమాలో గ్లామర్ తో అందరికీ మత్తెక్కించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళాశంకర్' సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించేందుకు సిద్దమయిందన్న వార్తలు గురించి తెలిసిందే. అయితే ఇపుడు ఈ ఇద్దరు హాట్ యాంకర్ల గురించి ఒక లేటెస్ట్ న్యూస్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు అందగత్తెలు కలిసి ఒకే సారి కెమెరా ముందుకు రావడం చాలా రేర్ అనే చెప్పాలి. అలాంటిది వీరిద్దరూ కలిసి ఇపుడు మెగాస్టార్ సినిమాలో నటించనున్నారు అని తెలుస్తోంది. చిరంజీవి నటిస్తున్న నూతన చిత్రం 'భోళా శంకర్' లో  వీరిద్దరూ గెస్ట్ రోల్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇంత పెద్ద న్యూస్ వినిపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా...ఇక రేపు అంతా ఇదే అంశం ఫోకస్ టాపిక్ గా మారే అవకాశం ఉన్నది. అయితే ఈ సినిమాలో రష్మీ మరియు అనసూయ లు ఎటువంటి పాత్రలలో కనిపించి తమ అభిమానులను అలరించనున్నారు అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: