ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు అంటే సదరు సినిమా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది అనే అనుకోవాలి. బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆయనపై ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకాడటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని భాషలలోనూ ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడడంతో వందల కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. సాహో సినిమా భారీ కలెక్షన్లు సాధించిన తర్వాత ప్రభాస్ మార్కెట్ పై అందరికీ నమ్మకం ఏర్పడింది.

బాహుబలి సినిమాను బాగా ప్రమోట్ చేశారు కాబట్టి రాజమౌళి దర్శకత్వం వహించాడు కాబట్టి కరణ్ జోహార్ లాంటి నిర్మాత వెన్నుదన్నుగా ఉన్నాడు కాబట్టి దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది ఆ సినిమా. తర్వాత ప్రభాస్ సినిమాలకు అంత సీను ఉండదు అనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో సాహో సినిమా విడుదల అయింది. అప్పుడు ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాహుబలి ని తలదన్నే రీతిలో కలెక్షన్లను సాధించి ప్రభాస్ ఇమేజ్ ను అందరికీ చాటి చెప్పింది. రాజమౌళి లేకుండా ప్రభాస్ సాధించిన ఈ కలెక్షన్లు చూసి నిర్మాతలు సైతం అవాక్కయ్యారు.

బాలీవుడ్ లోని సినీ నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. ఆ విధంగానే ఇప్పుడు ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతుంది. అంతేకాదు సలార్ అనే సినిమాను కూడా మొదలు పెట్టి అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాను నిర్మించిన సంస్థ నిర్మిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాలోని ఓ పది నిమిషాల సీన్ కోసం ఏకంగా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందట ఈ నిర్మాణ సంస్థ. దీన్ని బట్టి ప్రభాస్ ఇమేజ్ పై వారు ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఓ టాలీవుడ్ హీరో ఇంతటి స్థాయిలో బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేయడం చూస్తుంటే నిజంగా తెలుగు వారికి ఇది గర్వకారణం అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: