బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ని దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు బాగా కష్ట పెట్టిన రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ దాదాపుగా మూడున్నర సంవత్సరాల పాటు ఎంతగానో కష్టపెట్టాడు.వారి కష్టం కు సరైన ఫలితం అయితే దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఇప్పటికే మారి పోయాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అద్భుతమైన స్టార్డమ్ దక్కించుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.. ఏండ్లకు ఏండ్లు కష్టపడడం వల్లే ఈ స్టార్ హీరోలకు ఆ స్థాయి గుర్తింపు దక్కింది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. కష్టపడడం అంటే కేవలం డేట్లు కేటాయించడం మాత్రమే కాదని రాజమౌళి చెప్పినది చెప్పినట్టు గా చేయడం. సన్నివేశాల కోసం, ఫిజిక్ కోసం వారి రెక్కలు ముక్కలు చేసుకోవాలి.. ఒళ్ళు హూనం చేసుకోవాలి అప్పుడే రాజమౌళి సినిమా అద్భుతంగా వస్తుంది.

ఒక్కొక్క ఎపిసోడ్ కోసం అలాగే ఒక్క సన్నివేశం కోసం.. ఒక్క షాట్ కోసం రాజమౌళి పడే తపన హీరోలకు అప్పుడప్పుడు చిరాకు కూడా తెప్పిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మరియు రామ్చరణ్ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో సెట్స్‌ వదిలి పోవాలని అంత చిరాకు వేసింది అంటూ వ్యాఖ్యలు కూడా చేశాడు. అంతటి కష్టం ఇప్పుడు మహేష్ బాబు తో రాజమౌళి పడేలా చేస్తాడా అనేది చర్చనీయాంశంగా మారిందట.

మహేష్‌ బాబు తో రాజమౌళి తన తదుపరి సినిమాను చేయాల్సి ఉందని తెలుస్తుంది. మొదటి నుండి కూడా చాలా సుకుమారుడు అయిన మహేష్ బాబు వయసు రీత్యా కూడా ఆ ముగ్గురు హీరోలతో పోలిస్తే కాస్త ఎక్కువేనట.కనుక మహేష్ బాబు ను అంతగా రాజమౌళి రాచిరంపాన పెడతాడా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మహేష్ బాబు అంతటి కష్టానికి ఓకే చెప్పిన తర్వాత షూటింగ్ సమయంలో మహేష్ బాబు తో రాజమౌళి రీ టేక్ లు చేయించు కోగలడా అనేది చాలా పెద్ద ప్రశ్న. త్వరలోనే వీరిద్దరి కాంబో సినిమా పట్టాలేకబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలకు అయితే సమాధానం లభించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: