రామ్ చరణ్ హీరోగా ఎన్టీఆర్ మరొక హీరోగా ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రాజక్ట్ ఆర్ఆర్ఆర్ పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెల్సిందే. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేసారు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో పెర్ఫార్మన్స్ అదరగొట్టడంతో పాటు రాజమౌళి అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ ఆర్ఆర్ఆర్ కి భారీ సక్సెస్ ని అందించింది. ప్రస్తుతం శంకర్ తో చరణ్ ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

రాక్ స్టార్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ లో మాత్రమే కాదు యావత్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా టాలీవుడ్ లో చరణ్ వంటి స్టార్ హీరోతో చేస్తున్న మూవీ కావడంతో కథ, కథనాల విషయమై దర్శకుడు శంకర్ కూడా ఎంతో పక్కాగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనుండగా అందులో ఒకటి వృద్ధ పాత్ర కాగా మరొకటి యువకుడి రోల్ అని అంటున్నారు.

ఇటీవల లీక్ అయిన ఒక పిక్ ని బట్టి చూస్తే చరణ్ ఇందులో డబుల్ రోల్ చేస్తుంది నిజమే అని కొందరు అంటున్నారు. అయితే పక్కాగా చరణ్ ఇందులో రెండు పాత్రలు చేస్తున్నారా లేదా అనే దానిపై మాత్రం ఆయన ఫ్యాన్స్ లో ఒకింత ఆలోచన మాత్రం మెదులుతోంది. కాగా దీనిపై పక్కాగా క్లారిటీ రావాలి అంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: