ఈ వారం విడుదల కాబోయే సినిమాలలో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సినిమా పక్కా కమర్షియల్, ఈ మూవీ లో టాలీవుడ్ మాస్ హీరోలలో ఒకరు ఆయన గోపీచంద్ హీరోగా నటించగా, రాశి ఖన్నామూవీ లో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా, యు వి క్రియేషన్స్  బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రేపు అనగా జూలై 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే పక్కా కమర్షియల్ చిత్ర బృందం ఈ సినిమా నుండి టీజర్ , ట్రైలర్ , పోస్టర్ లను కొన్ని పాటలను కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు పక్కా కమర్షియల్ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినీ ప్రేమికులు పక్కా కమర్షియల్ మూవీ పై మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఇలా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 6 కోట్లు , సీడెడ్ 2.50 కోట్లు , ఆంధ్ర : 9 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పక్కా కమర్షియల్ మూవీ 17.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 0.50 కోట్లు , ఓవర్ సీస్ లో 1.20 కోట్లు .
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ 19.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోగా 20 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతోంది. మరి పక్కా కమర్షియల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: