టాలీవుడ్
సినిమా పరిశ్రమలో ఒకానొక సమయంలో తమ అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని అందరిని ఎంతగానో అలరించారు
హీరోయిన్ లు
కాజల్ మరియు
అనుష్క శెట్టి. ఈ ఇద్దరు కూడా ఒకే సమయంలో
సినిమా పరిశ్రమంలోకి వచ్చారని చెప్పాలి.
కాజల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా
అనుష్క సూపర్ సినిమాతో పరిచయం అయ్యి తన అందచందాలతో అందరినీ అలరించి మంత్రముగ్ధులను చేసింది. ఆ విధంగా వీరిద్దరూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు అని చెప్పాలి.
అనుష్క కెరియర్ తొలి నాళ్లలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో చేసే స్థాయికి ఎదిగింది.
అరుంధతి ఆమె కెరియర్ లోనే టాప్
సినిమా అని చెప్పవచ్చు.
కాజల్ కూడా ఒకటికి రెండు సార్లు అగ్ర హీరోల సరసన నటించి పెద్ద హీరోల అభిమానుల అభిమానాన్ని పొందింది. ఇద్దరు కూడా వారి వారి టైం లో టాప్ పొజిషన్ లో ఉండి అందరిని ఆలచించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ
సినిమా పరిశ్రమలో కనబడకపోవడం వారి వారి అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.
కాజల్ కి పెళ్లయి ఓ కొడుకును కూడా కంది. దాంతో ఆమె మళ్లీ సినిమాల్లోకి వచ్చే సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వచ్చినా కూడా ఆమె
హీరోయిన్ గా చేస్తుందా అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఆమెకు ప్రెగ్నెసీ అయిన తరువాత ఆమె యాక్ట్ చేసిన
సినిమా లో ఆమె పోర్షన్ నే తీసేశారు. ఇకపోతే
అనుష్క వివాహం చేసుకోపోయినప్పటికీ ఆమె ఎందుకో సినిమాలలో నటించడం జరగడం లేదు. కారణమేమిటో కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్
సినిమా లో నటిస్తుంది ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారు కానీ అది పట్టాలేక్కడం లేదు. మరి అభిమానులు వీరిని వదిలేసి ఇక రాబోయే కొత్త హీరోయిన్లకు అభిమానులుగా మారాల్సిందేనా అనేది తేలాల్సి ఉంది.