
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది నటీనటులు కొత్త వారికి కూడా అవకాశం కల్పించారట. ఇందులో ఉత్తరాంధ్రలోని యాస ఈ సినిమాలో హైలెట్ చేయడానికి ప్రయత్నిస్తోందట చిత్ర బృందం. ఈ సినిమా క్లైమాక్స్ ని కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాలలోని చిత్ర బృందం చిత్రీకరించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. వాస్తవ వాతావరణ అయితే పెద్ది సినిమాలోని సన్నివేశాలు కరెక్ట్ గా సరిపోతాయని చిత్ర బృందం ఇలా ప్లాన్ చేస్తోందట. ముఖ్యంగా క్లైమాక్స్ షూట్‌ని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలలో జరిపే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ సమయంలో ఆ ప్రాంతవాసులు కూడా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
బుచ్చిబాబు తెరకెక్కించిన మొదటి సినిమా ఉప్పెన సినిమా సముద్ర తీర ప్రాంత నేపథ్యంలో సాగే స్టోరీ కావడంతో ఎక్కువగా కాకినాడ ఉప్పాడ వంటి ప్రాంతాలలోని సినిమా షూటింగ్ చేశారట. అందుకే అక్కడ సెట్లో లేకుండా రియల్ లొకేషన్స్ లోని చిత్రీకరించినట్లు సమాచారం. అందుకే ఆ చిత్రంలోని సన్నివేశాలు కూడా బాగా హైలైట్ గా మారాయి. ఇప్పుడు పెద్ది సినిమాలోని క్లైమాక్స్ విషయంలో కూడా ఇదే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఏ మేరకు పెద్ది సినిమా విజయానికి హైలైట్ అవుతాయేమో చూడాలి.