
సుమంత్ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. ఇక సుమంత్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే...... ఇతడు నటి కీర్తి రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కీర్తి రెడ్డి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. అయితే సుమంత్ కీర్తి రెడ్డి, సుమంత్ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.
అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. అతి తక్కువ సమయంలోనే విడిపోయారు. కేవలం రెండేళ్ల పాటు మాత్రమే వీరిద్దరూ కలిసి ఉన్నారు. విడాకుల తర్వాత సుమంత్ ఇప్పటివరకు ఎవరిని వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. తన పూర్తి ఫోకస్ సినిమాల మీద పెట్టారు. ఈ క్రమంలోనే హీరో సుమంత్ నటి మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
దానికి గల ప్రధాన కారణం వీరిద్దరూ కలిసి ఫోటోలు దిగారు. అందులో మృణాల్ ఠాకూర్ సుమంత్ భుజం పైన తల వాల్చుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలు ఏదైనా సినిమాలో భాగంగా తీసుకున్నారా లేకపోతే నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే సందేహాలు అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి. ఈ వార్తలపై మృనాల్, సుమంత్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.