టాలీవుడ్ ఇండస్ట్రీ లో గొప్ప నిర్మాతగా పేరు తెచ్చుకున్న వారిలో రామానాయుడు ఒకరు. రామానాయుడు కుమారులలో సురేష్ బాబు నిర్మాతగా కంటిన్యూ అవుతూ ఉండగా , వెంకటేష్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. తన కుమారు అయినటువంటి వెంకటేష్ ను కలియుగ పాండవులు అనే సినిమాతో రామానాయుడు వెండి తెరకు పరిచయం చేశాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా ఈ బ్యానర్లో వెంకటేష్ పలు సినిమాలలో నటించాడు. కానీ రామానాయుడు నిర్మించిన ఏ సినిమాతో కూడా వెంకటేష్ కి మాస్ ఈమేజ్ దక్కలేదు.

అలాంటి సమయంలో తన సోదరుడికి అద్భుతమైన మాస్ విజయాన్ని అందించాలి అనే ఉద్దేశంతో సురేష్ బాబు "బొబ్బిలి రాజా" అనే కథను దగ్గరుండి తయారు చేయించాడు. ఇక సినిమా కథ మొత్తం తయారు అయింది. మాస్ అంశాలతో కూడిన ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ఎంతో కష్టపడి అడవుల్లో చిత్రీకరించారు. సినిమా మొత్తం పూర్తి అయింది. భారీ అంచనాల నడుమ మూవీ విడుదల అయింది. మూవీ విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ ను తెచ్చుకున్న ఎందుకో ఏమో తెలియదు కానీ మొదటి వారం పెద్దగా ఈ మూవీ కి కలెక్షన్లు రాలేదు. దానితో రామానాయుడు కూడా సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా క్లాస్ గా మూవీ ని చిత్రీకరించారు. ఇంకా కొన్ని మాస్ సన్నివేశాలు ఉండుంటే మూవీ మంచి విజయం సాధించేది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. దానితో సురేష్ బాబు కూడా సినిమాలో మాస్ అంశాలు పెట్టే సన్నివేశాలు పుష్కలంగా ఉన్నా కూడా క్లాస్ గా సినిమాను తీసి తప్పు చేశాం.

మాస్ అంశాలతో సినిమాను ఫుల్ గా నింపేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయ పడ్డాడట. కానీ వీరి అంచనాలను తారు మారు చేస్తూ రెండవ వారంలో ఈ సినిమా కలెక్షన్లు విపరీతంగా పెరిగి అద్భుతమైన విజయాన్ని ఈ సినిమా అందుకోవడం మాత్రమే కాకుండా వెంకటేష్ కి అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ ను కూడా ఈ సినిమా తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: