కొన్ని రోజుల క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కు ఐ.ఎం.ఎఫ్ 1 మిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిధుల మంజూరుకు సంబంధించి ఐ.ఎస్.ఎఫ్ పలు షరతులు విధించింది. మన దేశంతో ఉద్రిక్తతలు పెంచుకోవడం వల్ల పాకిస్తాన్ కే నష్టమని వెల్లడించింది. ఈ ఘర్షణల వల్ల దేశంలో ఆర్థిక, బాహ్య లక్ష్యాలకు ముప్పు కలుగుతుందని పేర్కొంది.
 
ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల స్టాక్ మార్కెట్ మొదట నష్టాల్లోకి వెళ్లినా ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని ఐ.ఎం.ఎఫ్ నివేదికలు చెబుతున్నాయి. ఐ.ఎం.ఎఫ్ నిధులను పాక్ అభివృద్ధి కోసం కాకుండా ఉగ్రవాదులను పోషించడానికి ఉపయోగిస్తోందని భారత్ ఇటీవల ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను పునర్నించడానికి జైసే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు 14 కోట్ల రూపాయలు ప్రకటించిందని భారత్ పేర్కొంది.
 
పాకిస్తాన్ కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టేనని భారత్ వెల్లడించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భారత్ ఐ.ఎం.ఎఫ్ ను కోరినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఐ.ఎం.ఎఫ్ పాక్ ను పరోక్షంగా హెచ్చరించడం గురించి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉనాయి. ఐ.ఎం.ఎఫ్ ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఈ మొత్తాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
పాకిస్తాన్ కు ఐ.ఎం.ఎఫ్ మొత్తం 11 షరతులు విధించిందని సమాచారం అందుతోంది. ఈ షరతుల నేపథ్యంలో పాకిస్తాన్ కు భవిష్యత్తులో మరిన్ని షాకులు తప్పవని చెప్పవచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. భారత్ మాత్రం పాక్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

imf