దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఆమె నటించడానికి ఒప్పుకుంటే 10 కోట్ల పారితోషికం ఆమెకు ఆఫర్ చేస్తున్నారు అంటే ఇప్పటికీ ఆమె హవా ఎలా ఉందో మనకు అర్థం అవుతుంది. సాధారణంగా నయనతార తాను నటించిన సినిమాల ప్రమోషన్ గురించి ఏమాత్రం పట్టించుకోదు.

రజనీకాంత్ లాంటి టాప్ హీరో సినిమాలో ఆమె నటించినప్పుడు స్వయంగా రజనీ అడిగినప్పటికీ ఆమె సున్నితంగా ఆసినిమా ప్రమోషన్ కు తాను రాలేను అని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చిరంజీవితో ఈమె ‘సైరా నరసింహా రెడీ’ ‘గాడ్ ఫాదర్’ సినిమాలలో ఈమె నటించినప్పుడు ఆసినిమాల ప్రమోషన్ గురించి కూడ ఆమె పట్టించుకోలేదు అన్న వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ గా అనీల్ రావిపూడి చిరంజీవితో తీస్తున్న సినిమాలో నయన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసే విషయంలో ఆమె కోరుకున్న పారితోషికం ఇవ్వడమే కాకుండా ఆమె నటించడానికి ఒప్పుకున్న వెంటనే అనీల్ రావిపూడి చాల తెలివిగా ఈసినిమాకు సంబంధించి ఆమెతో ప్రోమో వీడియో ఘాట్ చేసుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. నయనతార అనీల్ రావిపూడికి ఇలా సహకరించడం వెనుక అనీల్ రావిపూడి సమయస్పూర్తి ఉంది అని అంటున్నారు.

ఈమూవీలో చిరంజీవి పాత్రతో సరిసమానంగా ఉండే పాత్ర నయనతార ది కావడంతో ఆమె ఈసినిమాకు సంబంధించి ప్రోమో వీడియో విషయంలో అనీల్ రావిపూడికి సహకరించింది అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈమూవీలో ఒక అతిధి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనీల్ రావిపూడి మార్క్ కు దగ్గరగా ఉండే అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది అని అంటున్నారు. చిరంజీవి చాలకాలం తరువాత ఒక కామెడీ సినిమాలో నటిస్తూ ఉండటంతో ఈమూవీ పై అందరిలోనూ ఆ శక్తి బాగా ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: